హైదరాబాద్‌ బాక్సింగ్‌ బ్రదర్స్‌.. కిక్స్‌ అదుర్స్‌ 

16 Feb, 2021 09:01 IST|Sakshi

బాక్సింగ్‌లో రాణిస్తున్న అన్నదమ్ములు 

ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామంటున్న బాక్సర్లు 

తమ్ముడి బాటలో అన్న 

రహమత్‌నగర్‌: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కిక్‌ బాక్సింగ్‌లో రాణిస్తున్నారు కార్మికనగర్‌కు చెందిన  ఇద్దరు అన్నదమ్ములు. అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధనలు చేస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తూ అంతర్రాష్ట్ర, జాతీయ పతకాలు సాధిస్తూ శభాష్‌ అనిపించుకుంటన్నారు. 

  • రహమత్‌నగర్‌ డివిజన్‌ కార్మికనగర్‌కు చెందిన సయ్యద్‌ బషీర్, అంజమున్సిసా బేగం, దంపతులకు ఇద్దరు కుమారులు సుహైల్‌ (23) డిగ్రీ రెండో సంవత్సరం, సయ్యద్‌ సల్మాన్‌ (22) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బషీర్, ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుంటారు.  
  • కిక్‌ బాక్సింగ్‌ పై  ఆసక్తి ఉన్న అన్నదమ్ములిద్దరూ బంజారహిల్స్‌లోని ఓ కిక్‌ బాక్సింగ్‌ అకడామీలో శిక్షణ పొందారు. 
  • తొలిసారిగా 2011 నవంబర్‌లో చత్తీస్‌ఘడ్‌లో జరిగిన కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో (అండర్‌ 18 60 కేజీస్‌) సోహెల్, సల్మాన్‌ ఇద్దరూ పాల్గొనగా సోహెల్‌ బ్రౌన్‌ మెడల్‌ సాధించాడు.  
  • తాజాగా జనవరి 21 న ఢిల్లీలోని కాల్‌కోట్‌ స్టేడియంలో  జరిగిన పోటీల్లో కోల్‌కత్తా, కర్ణాటక బాక్సర్లను ఓటించి సోహెల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

అంతర్జాతీయ స్థాయిలో తలబడుతా.. 
అంతర్జాతీయ కిక్‌ బాక్సింగ్‌ పోటీ లు పోటీల్లో పాల్గొనడమే నా లక్ష్య ం. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ కఠోర సాధన చేస్తున్నా. ఇందుకు తమ తల్లి తండ్రులు మరింత పోత్సహిస్తున్నారు. ఏదో ఓ రోజు అంతర్జాతీయ స్థాయిలో తనబడుతాననే నమ్మకం ఉంది.     – సోహెల్‌ 

తమ్ముడే ఆదర్శం.. 
తమ్ముడు సోహెల్‌ను ఆదర్శంగా తీçసుకొని ముందుకెళ్తా. నేను సైతం కిక్‌ బాక్సింగ్‌లో రాణించి రాష్ట్రానికి పేరుతెస్తా. తమ్ముడికి గోల్డ్‌ మెడల్‌ రావడం ఆనందంగా ఉంది.  – సయ్యద్‌ సల్మాన్‌ 

చదవండి: మేయర్‌ వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

మరిన్ని వార్తలు