దసరా ఎఫెక్ట్‌: ప్లాట్‌ఫాం టికెట్‌ రేట్లు పెంపు.. స్పెషల్‌ ట్రైన్స్‌ వివరాలు ఇవే..

26 Sep, 2022 21:19 IST|Sakshi

దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేష్లన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు నేటి(సెప్టెంబర్‌ 25) నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 9 తర్వాత మళ్లీ టికెట్‌ ధర రూ. 10కి చేరుతుంది. ఇదిలా ఉండగా.. దసర పండుగ సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్టు వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

ప్రత్యేక  సర్వీసుల వివరాలు ఇవే..
- సెప్టెంబర్‌ 28న.. సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్‌. 
- సెప్టెంబర్‌ 29న.. యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్‌. 
- అక్టోబర్‌ 9న.. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌. 
- అక్టోబర్‌ 10న.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది. 

మరిన్ని వార్తలు