Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలు మునక.. ఫోటోలు, వీడియోలు

29 Jul, 2022 22:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని మరోసారి కారుమబ్బులు కమ్మేశాయి. జంటనగరాల్లో శుక్రవారం సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మణికొండ, కూకట్ పల్లి, షేక్‌పేట, టోలీచౌకి, రాయదుర్గం, గచ్చిబౌలి, నిజాంపేట, మూసాపేటలో భారీగా వానలు కురిసాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


ఇక ఒక్కసారిగా వరుణుడు దంచికొట్టడంతో సికింద్రాబాద్‌లోని పలు కాలనీలు, బస్తీలు నీట  మునిగాయి. ఏకధాటిగా గంటసేపు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పొంగిపొర్లుతున్న రహదారులు
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్‌పేట్‌ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్‌లో గంట సేపుగా కురిసిన కుండపోత వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


 

చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసినా రోడ్లపై నీరు చేరడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కుషాయిగూడ ,సైనిక్‌పురి, కాప్రా, చర్లపల్లి, దమ్మైగూడ, కీసర పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లిలో భారీ వర్షం 

ఎల్బి నగర్, వనస్థలిపురం, బి ఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్టు, పెద్ద అంబర్ పేటలో గాలులతో కూడిన భారీ వర్షం.

► ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్, అశోక్ నగర్ , ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ కాచిగూడ లో వర్షం

దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్త పేట్, సరూర్ నగర్, అబిడ్స్, కోఠి , నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికాపుల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం.

అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్ వర్షం.

ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్, అశోక్ నగర్ , ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ కాచిగూడ లో వర్షం

► దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్త పేట్, సరూర్ నగర్, అబిడ్స్, కోఠి , నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికాపుల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం.

► అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ ,కాటేదాన్ వర్షం.

మరిన్ని వార్తలు