హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్‌

6 Apr, 2023 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బీనగర్‌ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు వడగళ్లు, ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40 నుండి 50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి: పేపర్‌ లీక్‌ కేసులో ట్విస్ట్‌.. ఈటలకు బిగ్‌ షాక్‌!

మరిన్ని వార్తలు