ప్లాస్మాదానం ప్ర‌చారంలో రాజ‌మౌళి

18 Aug, 2020 12:29 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ప‌్ర‌జ‌ల్లో ప్లాస్మాపై అనేక అపోహ‌లుండేవ‌ని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని సైబ‌రాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు. కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట కూడా రూపొందించారని తెలిపారు. మంగ‌ళ‌వారం సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో ప్లాస్మా దానం చేసిన పలువురికి సీపీ స‌జ్జ‌నార్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి ప్రోత్సాహ‌కాలు అందించారు. (ప్లాస్మా దానానికి మహా స్పందన)

ఈ సంద‌ర్భంగా కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామ‌మ‌ని స‌జ్జ‌నార్ కొనియాడారు. కరోనా సోకితే ఎవ‌రూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్లాస్మా దానానికి అంద‌రూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ Donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించామ‌న్నారు. తమతో క‌లిసి అనేక స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, చాలా మంది యువత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నార‌ని చెప్పారు. (వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌.. వి స్టే సేఫ్‌)


 

సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్లు: 90002 57058, 94906 17444, రిజిష్టర్‌ పోర్టల్‌ లింక్‌: Donateplasma.scsc.in

మరిన్ని వార్తలు