6లోగా వరదలపై నివేదిక ఇవ్వాలి

29 Oct, 2022 01:53 IST|Sakshi

నవంబర్‌ 10న మంత్రివర్గ సమావేశానికి నివేదిక

నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ వెల్లడి

భద్రాచలం ముంపునకు ఆ మూడే కారణాలు: నిపుణుల కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌ : వరదల నివారణకు శాశ్వత చర్యలను సూచించడంతో పాటు ఏయే ప్రాంతాలను తరలించాల్సి ఉంటుందో సిఫారసు చేసేలా వరదలపై సమగ్ర నివేదికను నవంబర్‌ 6లోగా సమర్పించాలని నిపుణుల కమిటీని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ ఆదేశించారు. నవంబర్‌ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను సమర్పించి, తదుపరి ఆమోదం తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం పరిసరాలు నీట మునగడానికి పోలవరం బ్యాక్‌ వాటర్‌తో పాటు ఉప నదుల ప్రవాహం సజావుగా లేకపోవడం, నిలిచి ఉన్న నీరే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది.

దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్ర­శేఖరరావు ఆదేశాలతో నీటి­పారుదల­శాఖ ఈఎన్‌సీ (ఓ అండ్‌ ఎం) బి.నాగేంద్రరావు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేశారు. ప్రాథమిక అధ్యయనం అనంతరం అందులోని అంశాలపై శుక్రవారం జలసౌధలో నీటి పారుదలశాఖ రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్‌) సి.మురళీధర్, ఈఎన్‌సీ (గజ్వేల్‌) బి.హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఏడాదిలో 8 నెలలపాటు 892 ఎకరాలు ముంపులోనే...
పోలవరం నిర్మాణం పూర్తయి...150 అడుగులు (పూర్తిస్థాయి రిజర్వాయర్‌ లెవల్‌)లో నీటిని నిల్వ చేస్తే ఏడాదిలో 8 నెలల పాటు తెలంగాణలోని 892 ఎకరాలు నీట మునుగుతాయని నిపుణులు వివరించారు. ఈ భూములను పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలోనే భాగంగానే సేకరించాలని కమిటీ తెలిపింది. పోలవరం వద్ద డ్యామ్‌ నిర్మాణం జరగని సమయంలో 25.53 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తే పోలవరం నిర్మాణంలో 2,159 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికే పరిమితమైందని

ఈ కారణంగా 103 గ్రామాల్లోనే 40వేల ఎకరాలు నీటమునగగా..28వేల మంది దీనికి ప్రభావితులయ్యారని గుర్తు చేశారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా భద్రాచలం, బూర్గంపాడు, సారపాక వంటి లోతట్టు ప్రాంతాల్లో నీటిని నిరంతరం పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని, దీని కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ అండ్‌ మెయిటెనెన్స్‌ ప్రణాళికను సిద్ధం చేయాలని వివరించారు.  

మరిన్ని వార్తలు