శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు 

31 Aug, 2020 03:20 IST|Sakshi

శంషాబాద్‌: ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. 2020 కాన్ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గోద్రేజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌’అవార్డును పొందినట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లుగా శంషాబాద్‌ విమానాశ్రయం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4.55 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. హైదరాబాద్‌ విమానాశ్రయం ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో అవార్డులు పొందిందని, తమ పనితీరుకు అవార్డులు కొలమానమని జీహెచ్‌ఐఏఎల్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణీకర్‌ అన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు