రేపు దుబ్బాకలో ‘పారగమ్యత’ పుస్తకావిష్కరణ 

19 Sep, 2020 12:09 IST|Sakshi

సాక్షి, దుబ్బాక‌: దుబ్బాకలో 20వ తేదీన ‘పారగమ్యత’ పుస్తకాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీయూడబ్లుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో రాసిన వ్యాసాలను ‘పారగమ్యత’ అనే పేరుతో పుస్తకంగా అచ్చువేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం దుబ్బాక పట్టణంలోని నీలకంఠ పంక్షన్‌ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందన్నారు.

ముఖ్య అతిథులుగా టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంట చక్రపాణి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, వడితల సతీష్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సెన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో పాటు పలు ప్రముఖ దినపత్రికల ఎడిటర్లు, పత్రికా ప్రతినిధులు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా కో ఆర్డినేటర్‌ వర్ధెల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ సీఎం పీఆర్వో రమేశ్‌ హజారితో పాటు పలువురు మేధావులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు, సాహితి అభిమానులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముందుగా మెదక్‌ జిల్లా  చేగుంటలో అనుకున్నారని కొన్ని కారణాల వల్ల ఈ వేదికను దుబ్బాకకు మార్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు