రఘునందన్ ఓ వన్ మ్యాన్ మిషన్

14 Aug, 2021 22:20 IST|Sakshi

ఆచార్య సోనూ గోయల్ అభినందన

హైదరాబాద్‌: ఉద్యోగం చేస్తూనే.. పొగాకు నియంత్రణకు విశేష కృషి చేస్తున్న మాచన రఘునందన్‌ను ఒక వన్ మ్యాన్ మిషన్‌గా అభివర్ణించవచ్చు అని చండీగఢ్‌కు చెందిన రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సోనూ గోయల్ అన్నారు. బీబీనగర్ ఏయిమ్స్ సందర్శనకు వచ్చిన అయనను రఘునందన్ హైదరాబాద్ మారియట్ హోటల్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సోనూ గోయల్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సమాజ హితం కోసం మాచన రఘునందన్ చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి ఒక అసాధారణమైన యజ్ఞం వంటిది అని ఉదహరించారు.

తమ స్వార్థం తాము చూసుకునే నేటి తరంలో కూడా ఒక వ్యక్తి తన శక్తికి మించి సమాజానికి తన వంతు సాయం చెయ్యడం ఆదర్శప్రాయం అని అభినందించారు. యువత ముఖ్యంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండేందుకు ఐదు "డీ" ల సూత్రం అమలు చేయాలని సూచించారు. డీలే , డైవర్ట్, డూ యోగా, డ్రింక్ వాటర్, డూ ఎనీ థింగ్ అన్న పంచ సూత్రాలు ఆచరించాలన్నారు. దీంతో యువత పొగాకు, ధూమపానం అలవాటుకు దూరంగా ఉండే ప్రత్యామ్నాయ ఆలోచన మార్గాలు ఉత్తమంగా పని చేస్తాయని చెప్పారు. పొగాకును నిషేధించే కంటే దాని ప్రభావాలను ప్రజలకు వివరించి మానేయడానికి కృషి చెయ్యటమే గొప్ప ఫలితం ఇస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు