వేగంగా యూ టర్న్‌.. లారీని ఢీకొట్టి ప్రమాదం

22 May, 2021 10:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని ఎంత మొత్తుకున్నా వాహనదారుల్లో అసలు ఏమాత్రం మార్పు రావడం లేదు. జరిమానాలు విధించినా.. కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్‌ ధరించడం, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ మానుకోవడం, సిగ్నల్‌ జంప్‌ చేయకుండా ఉండటంలేదు. కనీస ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర  వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో షాబాద్‌లోని నాగర్‌గూడ కూడలి వద్ద వేగంగా బైక్‌ నడిపి యూ టర్న్‌ తీసుకున్నాడు. దీంతో రోడ్డుపై అంతే వేగంగా వస్తున్న లారీని ఢికోట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడళ్ల వద్ద ఎటువంటి నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలో చూచించారు.
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చూచించిన నిబంధనలు ఇవే..
► ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి.
► ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోవాలి.
► ముఖ్యంగా గ్రామాలలో, కూడళ్ల వద్ద వేగంగా వాహనాలు నడపకండి.
► పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.
 

చదవండి: జెర్సీకి విషెస్‌ చెప్తూనే సెటైర్‌ వేసిన పోలీసులు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు