రాజ్యాంగం.. ఓ రక్షణ కవచం

7 Jan, 2024 04:57 IST|Sakshi

ప్రతీ జడ్జికి శిక్షణ అవసరం

సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలి

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సులో ప్రసంగం 

పాల్గొన్న హైకోర్టు సీజే అలోక్‌ అరాధే, ఇతర న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్‌: న్యాయమూర్తులు అంతర్నిర్మిత దురభిప్రాయాలను వదిలించుకోవాలని, రాజ్యాంగ నైతికతను అన్ని సమయాల్లో సమర్థించాల్సిన అవ సరం ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లు సూచించారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ, తెలంగాణ హైకోర్టు శనివారం సంయుక్తంగా నిర్వ హించిన దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో జరిగింది. ఈ సద స్సుకు హాజరైన న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలను ఉద్దేశించి వారు మాట్లాడారు.

జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా మాట్లాడుతూ.. ‘కేవలం లక్ష్యాలను సాధించా లనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ప్రయత్నించకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని తీర్పుల్లో నాణ్యతను మరింత పెంచాలి. వీలైనంత త్వరిత పద్ధతిలో గుణాత్మక, సమర్థవంతమైన న్యా యాన్ని అందించాలి. బెయిల్‌ కోసం ఇంకా అనేక మంది నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని అత్యంత ప్రాధాన్యమైన ఆర్టి కల్‌ 21ని రక్షించడానికి మనం తీవ్రంగా కృషి చేయా లి. ఈ సోషల్‌ మీడియా యుగంలో మన పనితీరు పై ప్రజల పరిశీలన పెరిగిందన్న విషయాన్ని న్యా యమూర్తులు తెలుసుకోవాలి.

న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ ఎల్లప్పుడూ అవసరం. నాకు నచ్చిన సిటీల్లో హైదరాబాద్‌ ఒకటి. నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయం. కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయమూర్తికైనా శిక్షణ అవసరమే. ఒక్కో రాష్ట్రంలో చట్టాల్లో మార్పులు ఉంటాయి. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగించాలి
జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. ‘ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా న్యా యమూర్తుల విధి నిర్వహణ ఉండాలి. న్యాయ వ్యవస్థ తమకు ఓ రక్షణ కవచం అన్న భావన కల్పించాలి. సామాన్యుల విశ్వాసం చూరగొన్నప్పుడే న్యా యవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు. ఆ విశ్వ సనీయత కోల్పోయిన రోజు ఈ వ్యవస్థ నిష్ప్రయో జనం. అంతిమంగా రాజ్యాంగ సారాంశం సమా నత్వమే. పక్షపాతాలను పక్కకు పెట్టి పనిచేయాలి.

న్యాయమూర్తులు ఉపన్యాసాలు ఇవ్వడం మాని.. చట్టప్రకారం మాత్రమే తీర్పులు వెల్లడించాలి’అని సూచించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ.. రా జ్యాంగం కేవలం ఒక చట్టపరమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదని, ప్రజల రక్షణ కవచమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ సుజోయ్‌ పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, తెలంగాణ, ఇతర హైకోర్టుల న్యాయమూర్తులు మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు