అన్ని కులాలకు సమున్నత గౌరవం: ఎమ్మెల్సీ కవిత

11 Sep, 2022 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ, బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆల్‌ ఇండియా బంజారా అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్సీ కవితను కలిశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..  దేశంలో సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.  కేసీఆర్‌ 84 కులాలకు హైదరాబాద్‌ నగరంలో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించి, ప్రతి ఒక్క కులానికి సమున్నత గౌర వం కలి్పస్తున్నారని కవిత వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు