ఒక్కొక్కటిగా వెలుగులోకి నాగరాజు అక్రమాలు

15 Aug, 2020 17:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ​కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్‌ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్‌ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సురేందర్‌ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు.
(చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్‌)

‘నేను రిటైర్మెంట్‌ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్‌ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ  పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ  ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 
(చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు)

మరిన్ని వార్తలు