అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు

11 Sep, 2022 02:36 IST|Sakshi

మునుగోడులో అభ్యర్థిని ప్రకటిస్తే జరిగే పరిణామాలను ఎదుర్కోలేకనే జాప్యం

బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదు.. టీఆర్‌ఎస్‌ను ఉరేసినా తప్పులేదు

మీ ఓటుతో మోదీ, కేసీఆర్‌లను భూమి మీదకు దింపండి

స్రవంతి గెలుపు కోసం అందరూ సమష్టిగా పనిచేయాలి

టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించుకోలేని అచేతనావస్థలో టీఆర్‌ఎస్, బీజేపీలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యా ఖ్యానించారు. ఆయా పార్టీల నేతలపై నమ్మకం లేని కార ణంగానే అభ్యర్థులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతిని గెలిపించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమంతా సమష్టిగా పనిచేస్తుందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ముఖ్య నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బోసురాజు, అంజన్‌కు మార్, బలరాంనాయక్, మల్లు రవి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మునుగోడుకు టీఆర్‌ఎస్, బీజేపీ చేసిన మోసాన్ని అక్కడి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 10వేల ఎకరాల పోడు భూములకు ధరణిలో పట్టాలు రద్దు చేసిన టీఆర్‌ఎస్‌ అరాచకాలు మునుగోడులో అన్నీ ఇన్నీ కావని, ఆ పార్టీని ఉరేసినా తప్పులేదని అన్నారు. ఇప్పుడు ఒక్కదెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించే అవకాశం వచ్చిందన్నా రు. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేసి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

తాగేవాళ్ల దగ్గరికే వెళ్లను.. తాగుడు వ్యాపారం చేస్తానా?
లిక్కర్‌ స్కాంలో తనకూ సంబంధం ఉందని బీజేపీ చేస్తున్నది చిల్లర ప్రచారమని రేవంత్‌ అన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తు న్నారని చెప్పారు. తాగేవాళ్ల దగ్గరికే తాను వెళ్లనని, అలాంటిది తాగుడు వ్యాపారం చేస్తానా అని ప్రశ్నించారు. తాను డైరెక్టర్‌గా ఎప్పుడో రాజీనామా చేసిన ఆ కంపెనీని మూసే సిన 13 ఏళ్ల తర్వాత పనికి మాలిన మాటలు మాట్లాడు తున్నారని అన్నారు. సూదిని సృజన్‌రెడ్డి తనకు బంధువని, అంతమాత్రాన వారు చేసే వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ సొంత అన్న దమ్ములని, వారే రెండు పార్టీల్లో ఉండి, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నప్పుడు తనకు, తన చినమామ కొడు కు సృజన్‌రెడ్డికి ఏం సంబంధముంటుందన్నారు. ఒకవేళ తనకు ఏ కుంభకోణంలోనైనా ఈసుమంత భాగమున్నా ఏ సంస్థతోనైనా దర్యాప్తు జరిపించుకోవచ్చని రేవంత్‌ సవాల్‌ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ.. స్రవంతి గెలుపు కోసం కాంగ్రెస్‌ నేతలంతా పనిచేయాలని, తామంతా కలిసికట్టుగా ముందుకెళతామని చెప్పారు.

ఇక్కడ ఏడవలేకపోతున్నారు..
రాష్ట్రంలో ఏడవలేకపోతున్న కేసీఆర్‌ దేశంలో రాజకీయం చేస్తానని చెప్పడం ఏదో సామెత చెప్పి నట్లుగా ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కలు స్తున్న జాతీయ నేతలంతా యూపీఏతో ఉన్నవారేనని, వారిని కలవడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరిచి బీజేపీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్‌ ఎజెండా అని చెప్పారు. ఎన్డీయేలో ఉన్న ఏ మిత్రపక్ష పార్టీతో కేసీఆర్‌ చర్చలు జరిపి వారిని బీజేపీ నుంచి దూరం చేశారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ

మరిన్ని వార్తలు