కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టాలి

10 Jun, 2022 02:19 IST|Sakshi

అప్పుడే మోదీతో యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు నమ్ముతారు 

ప్రజా దర్బార్‌ మంచిదే.. గవర్నర్‌ పాలన ఇంకా బెటర్‌

మీడియాతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కొట్లాడుతు న్న ట్టు డ్రామా ఆడుతున్న సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. అప్పుడే మోదీ తో యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసిస్తా రని అన్నారు. అలా కాకుండా ఎన్నికలు బహిష్కరించినా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. అది బీజేపీకి అనుకూలమే అని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సంజయ్‌ వ్యాఖ్యలపై ప్రెస్‌మీట్లు పెట్టి స్పం దించిన కేసీఆర్‌.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నగరానికి వచ్చి చేసిన కామెంట్లను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ స్థాయి సంజయ్‌ లెవ ల్లోనే ఉందని, మోదీ, అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చేంత సీన్‌ లేదని విమర్శించారు. రేవంత్‌ గురువారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతిని«ధులతో చిట్‌ చాట్‌లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ ఆర్థిక ఉగ్రవాది
టీఆర్‌ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయని, వాళ్లది అత్తాకోడళ్ల పంచాయితీ లాంటిదని రేవంత్‌ పేర్కొన్నారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడని కేసీఆర్‌ను విమర్శిస్తున్న బీజేపీ.. మళ్లీ మొన్న రూ.4 వేల కోట్ల మేర అప్పు ఎందుకు ఇప్పించిందో వెల్లడిం చా లని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహి స్తున్న ప్రజా దర్బార్‌ మంచిదేనని, అయితే గవర్నర్‌ రూల్‌ పెడితే ఇంకా మంచిదని వ్యాఖ్యానించారు. చురుకైన ప్రభుత్వం లేనప్పుడు ప్రజా సమస్యలను గవర్నర్‌ పరిష్కరించడంలో తప్పులేదన్నారు. 

వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ను తొలగించాలి
జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసులో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ను పదవి నుంచి తొలగించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. అధికారిక వాహనాల్లో రేప్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ ఉన్నా రని ప్రశ్నించారు. కేసీఆర్, ఎంఐఎం ప్రభు త్వంలోనే కాకుండా అత్యాచారాలు, నేరా ల్లోనూ మిత్రపక్షాలే అని విమర్శించారు. శాంతిభద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు విభజన చట్టంలోని సెక్షన్‌ 8ను ఉపయోగించుకునేందుకు గవర్నర్‌కు అధికారాలున్నాయని చెప్పారు. తాను లేకుండానే జరిగిన రాష్ట్ర కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌పై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వ్యవస్థా గతంగా నిర్వహించే కార్యక్రమాలు వ్యక్తులు న్నా, లేకున్నా ఆగవని, సమయం ప్రకారం జరుగుతుంటాయని స్పష్టం చేశారు. 

ప్రగతి భవన్‌కు వస్తా 
రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించడానికి తాను ప్రగతిభవన్‌కు వస్తానని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో శాంతిభద్రతలు ఇంకా దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

దుష్ట సంస్కృతితో భయాందోళనలు 
‘హైదరాబాద్‌లో పబ్, క్లబ్, డ్రగ్స్‌ వాడ కం వంటి దుష్ట సంస్కృతి తీవ్ర భ యాందోళనలను కలిగిస్తోంది. ముఖ్యం గా ఆడపిల్లల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బతకడం మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అవమానకరం కాదా..? డ్రగ్స్, పబ్స్, క్లబ్స్‌ మీద, వాటి నిర్వాహకులపై ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు? ఇప్పటివరకు ఒక సీఎంగా ఎందుకు సమీక్ష చేయలేదు..?’అని రేవంత్‌ నిలదీశారు.  

మరిన్ని వార్తలు