బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై రేవంత్‌ ధ్వజం

19 Nov, 2021 01:59 IST|Sakshi

సహారా కుంభకోణంలో కేసీఆర్‌ను మోదీ, అమిత్‌షా కాపాడుతున్నారు

ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది 

వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ముట్టడించిన కాంగ్రెస్‌ నేతలు 

రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టుకున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఆందోళనకారులు ముట్టడించారు.    

సాక్షి, హైదరాబాద్‌: రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాలు పోటీ పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నా యని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టు కున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరే ట్‌ను ముట్టడించారు. అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు.

ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని కమిషనరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 గంటల ధర్నా అనంతరం కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్, వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్‌ను కేంద్రమే కాపాడుతోంది
సహారా కుంభకోణంలో జైలుకు వెళ్లకుండా కేసీఆర్‌ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కాపాడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతున్నారు. రైతులకు మేలు చేయాలంటే వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యం చూడాలి. ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తే రైతులుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో తిరిగి ఏం ఉద్ధరిస్తారు. పార్లమెంట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ కార్యాచరణ ఏంటో ప్రకటించాలి. జంతర్‌మంతర్‌ వద్దకు ధర్నా చేయగలవా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగలవా?’ అని రేవంత్‌ అన్నారు.

చైనా, పాకిస్తాన్‌ కొంటాయా: భట్టి
రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు కాకుంటే.. చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా దేశాలు కొంటాయా అని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్కార్‌ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయని కేసీఆర్‌.. ఇప్పుడు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కేసీఆర్‌కు పాలన చేతగాకుంటే దిగిపో వాలి. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన ప్రభుత్వాల ను ఇప్పటివరకు చూడలేదు. కేసీఆర్‌ పాలనలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాయని, డ్రామాలు ఆపి వడ్లు కొనాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. 


 

మరిన్ని వార్తలు