ఆర్‌జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్‌ క్వాలిటీ అవార్డు

2 Mar, 2021 14:52 IST|Sakshi

శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఆర్‌జీఐఏ నిలిచింది. ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఆర్‌జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్‌‌ క్వాలిటీ అవార్డు అందజేసినట్లు జీఎంఆర్‌ వర్గాలు వెల్లడించాయి. సర్వీస్‌ క్వాలిటీ అవార్డు పొందడం పట్ల జీఎంఆర్‌ హెచ్‌ఐఏల్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడంలో కోవిడ్‌ మరింత అప్రమత్తం చేసిందని ఎయిర్‌పోర్ట్‌ ఈడీ, సౌత్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ కిషోర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు