కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం

3 Jun, 2021 08:48 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్‌గూడెం శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డీపీఎం వ్యాన్‌ను ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి బృందం హన్మకొండ నుంచి లక్షెట్టిపేటకు కారులో బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు డేవిడ్‌గా గుర్తించారు.
చదవండి: Himayat Nagar: బయటకు వస్తే చంపేస్తా..! 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు