ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద కారు ప్రమాదం

10 Oct, 2020 10:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. అతి వేగంగా వస్తున్న నిసాన్‌ కారు ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్దకు రాగానే పల్టీ కొట్టడంతో శనివారం​ ఉదయం ఈ ప్రమాదం చోటుచుకుంది. కారులో ఉన్న వారంత స్వల్ప గాయాలతో భయటపడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్‌ పోలీసలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్‌ సహాయంతో కారును పక్కకు తొలగించారు.

కారు ప్రమాదంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి‌ నియంత్రణ కోల్పోడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాహనాల నడిపే చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం. (హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. హైకోర్టు ఉద్యోగి మృతి)

మరిన్ని వార్తలు