భారీగా గుంతలు: ప్రాణాలు పోతేనే.. పట్టించుకుంటారా?

25 Jul, 2021 11:18 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పేరుతో రోడ్ల వెంట భారీగా గుంతలు తవ్వుతున్నారు. పైపులైన్లు వేయడంలో ఆలస్యం కావడం.. గుంతల వద్ద కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం వరంగల్‌ హెడ్‌ ఫోస్టాఫీస్‌ సమీపంలోని ఓ వృద్ధుడు అదుపు తప్పి డ్రెయినేజీలో పడిపోయాడు.

గమనించిన ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు వెంకన్న, షబ్బీర్‌లు వెంటనే స్థానికుల సహకారంతో బయటకు తీశారు. ఇలా వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు నుంచి చౌరస్తా వరకు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా.. వెంటనే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 
 

మరిన్ని వార్తలు