వీడెవడో మామూలోడు కాదు.. రిటైర్డ్‌ డీజీపీ ఇంటిని కూడా వదల్లేదు

7 Jul, 2021 11:57 IST|Sakshi
పతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10(సీ)లోని ప్లజెంట్‌ వ్యాలీలో నివసించే రిటైర్డ్‌ డీజీపీ రాయ్‌ వినయ్‌ రంజన్‌(62) ఇంట్లో రూ.5 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న సీపీఎల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభుదాస్, పనిమనిషి కుమారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. తన బెడ్‌రూమ్‌లో బ్రీఫ్‌కేస్‌లో రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లతో రూ.5 లక్షల నగదు పెట్టడం జరిగిందని, ఈ నెల 4వ తేదీన ఈ చోరీ జరిగిందని ఆయన తెలిపారు.

తన ఇంట్లో పనిచేస్తున్న వారిపైనే అనుమానాలు ఉన్నాయని, వారు మాత్రమే ఈ డబ్బును దొంగిలించే అవకాశం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. దర్యాప్తు బృందం మాజీ డీజీపీ ఇంట్లో తనిఖీలు చేసి పలు ఆధారాలు సేకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు.  

కిటికీ గ్రిల్స్‌ తొలగించి భారీ చోరీ 
జవహర్‌నగర్‌: ఇంట్లో నిద్రిస్తుండగానే గుర్తుతెలి యని దుండగులు కిటికీ గ్రిల్స్‌ తొలగించి అల్మారా లోని బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వంపుగూడ బ్యాంక్‌కాలనీలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. కోనేరు సుధారాణి 15 సంవత్సరాలుగా బ్యాంక్‌కాలనీలో నివసిస్తోంది. ఆమె కూతురు అదే కాలనీలో వెనుక వీధి లో నివాసముంటున్నారు. గతనెల 15న ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి తాకట్టులో ఉన్న బంగారం విడిపించి బెడ్‌రూంలోని అల్మారాలో దాచిపెట్టింది.

ఈనెల 5వ తేదీన అదే కాలనీలో బంధువుల దశదినకర్మ ఉండటంతో వెళ్లి రాత్రి వచ్చి బీపీ, షుగర్‌ మందులు వేసుకుని హాల్‌లో నిద్రలోకి జారుకుంది. మంగళవారం ఉదయం బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.88 లక్షల నగదు కనిపించలేదు. ఫిర్యాదు మేర కు ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్‌నగర్‌ పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు