సీటింగ్‌ 30.. ట్రావెలింగ్‌ 134

24 Nov, 2021 17:56 IST|Sakshi
ఆదిలాబాద్‌ బస్టాండ్‌లో బస్సులోని కూలీలు

సాక్షి, జైనథ్‌(ఆదిలాబాద్‌): జైనథ్‌ మండలం భోరజ్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రావెల్‌ బస్సును ఏఎంవీఐ స్రవంతి సీజ్‌ చేశారు. ఆర్టీసీ అధికారులతో కలిసి 44వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలతో హెదరాబాద్‌కు వెళ్తున్న బస్సు (పీవై05ఈ1433)ను తనిఖీ చేయగా అందులో 134 ప్రయాణికులు ఉన్నారు.

30 మంది ప్రయాణించే బస్సులో 134 మందిని తరలిస్తుండటంతో ఓవర్‌లోడ్‌ కారణంగా  బస్సును సీజ్‌చేసి ప్రయాణికులతోసహా ఆదిలాబాద్‌ బస్‌స్టాండ్‌కు తరలించారు. దీంతో కూలీలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి ఆదిలాబాద్‌ బస్టాండ్‌లోనే సేదతీరారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ బస్‌స్టాండ్‌కు చేరుకుని కూలీలతో మాట్లాడా రు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.  బస్సు ఓనర్‌కు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. 

మరిన్ని వార్తలు