పాడిరైతుకు రూ.40కోట్లు

24 Dec, 2020 05:10 IST|Sakshi

వారంలో బ్యాంకు ఖాతాల్లోకి ప్రోత్సాహక నిధులు జమ చేస్తాం

మరణించిన పశువుల స్థానంలో కొత్తవి 

ఐదురోజుల్లోగా రైతుబంధు సాయం – ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సాక్షి, నారాయణఖేడ్‌: విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, పాడి రైతులకు బకా యిలు ఉన్న రూ.40 కోట్ల ప్రోత్సాహక నిధులు వారం రోజుల్లో విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వ పంపిణీ ద్వారా పొందిన పశువులు మృతి చెందితే వాటి స్థానంలో జనవరి తొలివారంలో కొత్తవి కొని రైతులకు అందిస్తామని తెలిపారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాడి రైతులు సరఫరా చేసిన పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తోపాటు గేదె పాలకు మరో రూ.2 అదనంగా అందజేస్తామన్నారు. చదవండి: (స్మార్ట్‌ సిటీలు.. కావాలా..వద్దా?)

రాష్ట్రం లోని రైతులకు యాసంగి సాగుకు రూ.5వేల చొప్పున రూ.7,250 కోట్ల రైతుబంధు సాయంను వచ్చే సోమవారంలోగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ట్రల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను తెలంగాణలో కలుపుకొమ్మని కోరుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి తీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఖేడ్, ఆందోల్‌ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు