హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు

3 Oct, 2022 10:50 IST|Sakshi

గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక అంక్షలు విధించారు. ఎల్‌బీ స్టేడియం మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించేలా నగర ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల మీదుగా కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్‌

అబిడ్స్‌ చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి బిజెఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఎఆర్‌ పెట్రోల్‌ పంపు మీదుగా మళ్లిస్తారు.  
బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ మూసివేసి ఆ వాహనాలను ఎస్‌బిఐ గన్‌ఫౌం డ్రీ వైపు మళ్లిస్తారు.  
రవీంద్రభారతి, ఆదర్శ్‌నగర్‌ ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి.  
నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్‌ మీదుగా హిమయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు వెళ్లాలి 
కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్‌ తాజ్‌మహల్‌ హోటల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.  

ఆర్టీసీ బస్సులు ఇలా...  
కెపిహెచ్‌బి, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులు ఏఆర్‌ పెట్రోల్‌ పుంపు మీదుగా నాంపల్లి వైపు మళ్లించారు
కోఠి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే బస్సులు కాచిగూడ, నారయణగూడ, హిమయత్‌నగర్‌ మీదుగా వెళ్లాలి

పార్కింగ్‌ ఇలా... 
వీఐపీ, అధికారుల కోసం టెన్నిస్‌ గ్రౌండ్‌ వద్ద.  
ప్రింట్‌ ఆండ్‌ మీడియా ప్రతినిధుల కోసం సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయం వద్ద. 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానం వద్ద..  

మరిన్ని వార్తలు