డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం

22 Sep, 2021 01:48 IST|Sakshi

‘ఊరినే అమ్మేశారు’తో యువతరానికి మేల్కొలుపు

సాక్షి, హైదరాబాద్‌: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్‌ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు.

బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది.  పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్‌.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య,  డా.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు