Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

2 Oct, 2022 10:10 IST|Sakshi

1. సచివాలయాల ఉద్యోగుల కుటుంబాలపై సీఎం జగన్‌ ‘కారుణ్యం’
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్‌ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌.. వినతిపత్రం విసిరేసి..
వరంగల్‌ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!
తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం
ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరిగి 127 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. 26 ఏళ్ల తరువాత న్యాయం: విధి చేసిన గాయం.. భక్తుడు చేసిన సాయం!
పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. హైదరాబాద్‌: మైండ్‌బ్లోయింగ్‌ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు.. లేట్‌ చేయకండమ్మా!
మొబైల్‌ రిటైల్‌రంగంలో ఏపీ, తెలంగాణల్లో వేగంగా విస్తరించిన మల్టీబ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చైన్‌ లాట్‌ మొబైల్స్‌ దసరా, దీపావళి ధమాకా ఆఫర్లను ప్రారంభించింది.  అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ వాచెస్, హోం థియేటర్‌ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. DOCTOR G : మగ గైనకాలజిస్ట్‌ తిప్పలు
‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్‌ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్‌. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్‌ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్‌ మహిళా గైనకాలజిస్ట్‌ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన  ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్‌.  భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్‌ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. తీవ్ర విషాదం.. రెండు రోజుల క్రితం తమ్ముడు.. ఇప్పడు రశ్మితా
స్థానిక పారాబెడలో నివసిస్తున్న గదాధర నాయిక్‌ ఇంటిలో మరో విషాదం నెలకొంది. తన 12 ఏళ్ల కుమారుడు శిభాశిస్‌ నాయిక్‌ ఆత్మహత్య చేసుకొని మరణించి రెండు రోజులు గడవక ముందే కూతురు రశ్మితా నాయిక్‌(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు