ప్రతిభకు పట్టం కడదాం..

10 Jan, 2021 02:56 IST|Sakshi

‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు’లకు ఎంట్రీల ఆహ్వానం 

చివరి తేదీ జనవరి 13, 2021 

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే రెండేళ్లకు (2019, 2020) ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు జనవరి 13, 2021 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు.

నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్‌ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు www.sakshiexcellenceawards.com  వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–23322330 నంబర్‌పై గానీ, sakshiexcellenceawards2019@sakshi.com మెయిల్‌ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. 

మరిన్ని వార్తలు