మ్యాజిక్‌ లేదు..మాటలతోనే.. 

11 Jan, 2023 04:21 IST|Sakshi

కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి 

పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడితో విడివిడిగా భేటీ అవుతా..

సీనియర్లతోనూ మాట్లాడతా.. అందరి మనసులో మాట తెలుసుకుంటా.. 

వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే టాస్క్‌ ఏఐసీసీ అప్పగించింది 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్‌ ఠాక్రే చెప్పారు. ఏ సమ స్యకైనా పరిష్కారం ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలకు కూడా ఎక్కడోచోట పరిష్కారం లభిస్తుందని, ఆ పరిష్కారం కనుగొనేందుకే తాను తెలంగాణకు వస్తున్నానని అన్నారు.

తాను రాష్ట్రానికి వచ్చి ఏదో మ్యాజిక్‌ చేయాలనుకో వడం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమవుతుందనేది తన నమ్మకమని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా నియా మకమైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంగళవారం ముంబై నుంచి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలుఠాక్రే మాటల్లోనే..

కాంగ్రెస్‌ బలం తగ్గలేదు..
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో మా బలం ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ పట్ల సానుభూతితో ఉన్నారు. నాకున్న అవగాహనకు తోడు పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకుని, డిస్కషన్స్‌ (చర్చలు)తోనే తెలంగాణ కాంగ్రెస్‌ను డీల్‌ చేయాలనుకుంటున్నా. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడిని విడివిడిగా కలవాలని నిర్ణయం తీసుకున్నా.

వచ్చీ రాగానే విడివిడిగా సమావేశం ఎందుకు పెట్టారన్నదానికి ప్రత్యేక సమాధానం ఏం లేదు.. కానీ ఒంటరిగా కలిసిన ప్పుడే కొంతమంది అన్ని విషయాలు మాట్లాడతా రు. రాజకీయ పార్టీల్లో ఈ ఒరవడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేర్వేరుగా కలవాలని నిర్ణ యం తీసుకున్నా. రాష్ట్రానికి చెందిన మరికొందరు సీనియర్‌ నేతలతో కూడా విడిగా భేటీ అవుతా. పార్టీ పటిష్టత, గెలుపు కోసం వారి మనసులో మాట ఏంటో తెలుసుకుంటా. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు జ రుగుతాయి. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే టాస్క్‌ ఏఐసీసీ నాకిచ్చింది. ఆ టాస్క్‌ను విజయవంతం చేయడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా.’

రాష్ట్రంలో బీజేపీ గాలిబుడగలాంటిది
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నా యం. ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్‌ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీల ప్రభావం కొంతమేర ఉన్నా మేం లేకుండా ఏమీ చేయలేరు. బీఆర్‌ఎస్‌ అయినా మరే కొత్త పార్టీ వచ్చినా అది సాధ్యం కాదు. తెలంగాణలో బీజేపీ గాలిబుడగ లాంటిది. కాంగ్రెస్‌ పార్టీని దాటి ముందుకెళ్లే పరిస్థితి ఇప్పట్లో జరిగేది కాదు. తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి  వచ్చి తీరతాం. 

మరిన్ని వార్తలు