కరోనా: బయటపడ్డ ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాకం

16 Apr, 2021 16:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రజల నిర్లక్ష్యంతో కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,500కుపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రైవేటు ఆసుప్రత్రులు మాత్రం బెట్స్‌ ఖాళీగా లేవని చెబుతున్నాయి. కోవిడ్‌ బెడ్స్‌కు సంబంధించి ‘సాక్షి’ చేసిన పరిశోధనలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. 

ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. కానీ తీరా సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి కరోనా బెడ్స్‌ కోసం ఆరా తీయగా ఖాళీ లేవని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఎప్పుడు ఖాళీ అవుతాయో కూడా చెప్పలేమని చేతులెత్తేస్తున్నారు. అయితే స్థానిక సెక్యూరిటీని కదిలిస్తే.. ‘మహారాష్ట్ర నాందేడ్‌ నుంచి పేషెంట్లు వస్తున్నారని, వారితోనేబెడ్స్‌ నిండిపోయాయి సార్’‌ అంటూ బాంబు పేల్చాడు. పైగా ఇక్కడ ఖాళీ లేవు కానీ తనకు తెలిసిన ఆస్పత్రిలో ఫ్రెండ్‌ పని చేస్తాడట... అక్కడ కాస్త కాసులు ఎక్కువ పెడితే బెడ్‌ దొరికిపోతుందని ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆ కథేంటో... కార్పొ‘రేటు’ ఆసుపత్రుల ఆటలు ఏవో మీరే చూడండి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు