Morning Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

1 Aug, 2022 09:56 IST|Sakshi

1. మరింత చేరువగా.. ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయి నుంచే రిఫరల్‌ విధానం 
రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం. టీడీపీ  హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ఈ పథకానికి ఊపిరిలూదుతూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంపు భేష్‌.. సీడబ్ల్యూసీ కమిటీ ప్రశంసలు
పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును ఒక మీటర్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టార్గెట్‌ కాంగ్రెస్‌! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్‌?
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్‌.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు
భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం జరగనుంది. రీజినల్‌ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అమెరికా చైనా మధ్య... తైవాన్‌ తకరారు.. ఏమిటీ వివాదం?
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్‌ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నిఖత్‌ పంచ్‌ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు
కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో నిఖత్‌ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్‌) తట్టుకోలేక విలవిలలాడింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బిగ్‌ రిలీఫ్‌.. భారీగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌
ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..?
‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్‌. సుమన్‌గా సుపరిచితుడైన తల్వార్‌ సుమన్‌ గౌడ్‌ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కాల్పుల కలకలం.. మాదాపూర్‌లో రౌడీ వార్‌.. ఒకరి మృతి
మాదాపూర్‌  నీరూస్‌ చౌరస్తాలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌ మృతి చెందగా, జహంగీర్‌కు తీవ్ర గాయలయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్‌ బ్లాంక్‌లో రౌడీషీటర్‌ మహ్మద్‌ కాల్పులు జరిపాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి.. పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ కూచ్‍బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు