సలేశ్వరంలో విరిగిపడిన కొండచరియలు

18 Apr, 2022 03:37 IST|Sakshi
గాయపడిన భక్తుడిని అంబులెన్స్‌ నుంచి దింపుతున్న పోలీసులు 

ఆరుగురు భక్తులకు గాయాలు

ఆస్పత్రికి తరలించిన పోలీసులు

ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాల

లింగాల/అచ్చంపేట/అచ్చంపేట రూరల్‌/మన్ననూర్‌: నల్లమలలో కురుస్తున్న అకాల వర్షాలతో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల పరిధిలోని సలేశ్వరం లోయలో ఉన్న భక్తులు శివ(నాగర్‌కర్నూల్‌), సూర్యనారా యణ(నల్లగొండ), విజయలక్ష్మి (లింగో టం, అచ్చంపేట మండలం), కొత్తపల్లి ప్రతాప్‌రెడ్డి, పాండయ్య(షాబాద్, రంగా రెడ్డి జిల్లా), జిందమ్మ(శక్తినగర్, రాయచూర్, కర్ణాటక)లకు గాయాల య్యాయి.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ఇదిలా ఉండగా... మూడు రోజుల పాటు సాగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అక్కడి కొండలు, గుట్టలు ఎక్కుతూ ‘వస్తున్నాం.. లింగమయ్యా, వెళ్లొస్తాం లింగమయ్య..’ అంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. అమ్రాబా ద్‌ అభయారణ్యం శివనామ స్మరణతో మార్మోగింది.

మరిన్ని వార్తలు