ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ జాతర

4 Mar, 2021 08:34 IST|Sakshi

వెంకటాపురం(కె): మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీలోని రంగరాజాపురం కాలనీలో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం అమ్మవార్లను పులి వాహనంపై మండల కేంద్రంలో ఊరేగించారు. అమ్మవారి జాతరను తిలకించేందుకు వెంకటాపురం, వాజేడు మండలాల నుంచే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు.

ఘనంగా తిరుగువారం పండుగ
ములుగు రూరల్‌: మండంలొని పొట్లాపురంలో నూతనంగా వెలిసిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర సందర్భంగా పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు తిరుగువారం పండుగను పూజారులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తిరుగువారం సందర్భంగా పూజారులు అమ్మవార్లకు చీరసారెలు, పసుపు, కుంకుమలు సమర్పించి, యాటపోతులను బలిచ్చారు.  సర్పంచ్‌ కుమ్మిత లతఅంకిరెడ్డి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఈసం పాపయ్య, వార్డు సభ్యురాలు కవితయుగేంధర్, లక్ష్మీనారాయణ, రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు