తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌.. ఎందుకంటే?

3 Oct, 2022 19:18 IST|Sakshi
వాహనాలను ఆపి పరిశీలిస్తున్న పోలీసులు

రాష్ట్రంలోకి వచ్చే పశువుల ఆరోగ్యంపై పరిశీలన

జహీరాబాద్‌: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. 

కలెక్టర్‌ శరత్‌ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం)

మరిన్ని వార్తలు