యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌

11 Jun, 2022 03:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధా న కార్యదర్శిగా వికారా బాద్‌కు చెందిన సంతోష్‌ కోలుకుండను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కొత్తగా 10 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 49 మంది జాతీయ కార్యదర్శులు, 9 మంది సం యుక్త కార్యదర్శులు, 8 భిన్న విభాగాలకు చైర్మన్‌లను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. నల్లగొండకు చెందిన మమత నాగిరెడ్డి, మంచి ర్యాలకు చెందిన శ్రవణ్‌రావు, వరంగల్‌కు చెందిన సాగరిక రావులతో పాటు ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బి.రమేశ్‌ బాబులను జాతీయ కార్యదర్శులుగా నియమించారు. 

మరిన్ని వార్తలు