టీఆర్‌ఎస్‌కు ఊరంతా రాజీనామా

29 Jun, 2022 01:57 IST|Sakshi
రామన్నగూడెంలో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్న సర్పంచ్, గ్రామస్తులు   

సర్పంచ్‌ సహా 160 కుటుంబాలు మూకుమ్మడి రాజీనామా  

పాదయాత్రను అడ్డుకోవడం, లాఠీచార్జ్‌కు నిరసన 

అశ్వారావుపేట రూరల్‌: సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్‌కు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడమే కాక లాఠీచార్జ్‌ చేయడాన్ని నిరసిస్తూ రామన్నగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఐదుగురు వార్డు సభ్యులు సహా గ్రామంలోని 160 కుటుంబాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్‌ మడకం స్వరూప, గ్రామస్తులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీతో పాటు మరికొందరు నాయకులు పోలీసులను ఉసిగొల్పి తమ పాదయాత్రను అడ్డుకున్నారని వివరించారు. మహిళలపైనా పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తుంటే సొంత పార్టీ వారు అడ్డుకోకపోగా, తరువాత పరామర్శించేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు