డప్పుకొట్టి నిరసన... 

10 Aug, 2021 02:18 IST|Sakshi
ఎంపీడీవో కార్యాలయం ముందు డప్పుకొడుతున్న అంధుడు వీరయ్య

ఎస్సీ కార్పొరేషన్‌ రుణం మంజూరు కాలేదని అంధుడి ఆవేదన

శంకరపట్నం: నాలుగేళ్లుగా తిరుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్‌ రుణం మంజూరు చేయడం లేదని కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండల పరిషత్‌ కార్యాలయం ముందు సోమవారం కన్నాపూర్‌కు చెందిన అంధుడు దేవునూరి వీరయ్య డప్పుకొట్టి నిరసన తెలిపాడు. 2017 డిసెంబర్‌ 27న వికలాంగుల కోటా కింద రూ.2 లక్షలకు బ్యాంక్‌ కాన్సెంట్‌ లెటర్‌ ఇచ్చింది. 2017 డిసెంబర్‌ నుంచి శంకరపట్నం మండల పరిషత్‌ కార్యాలయం, కరీంనగర్‌ ఏడీ కార్పొరేషన్‌ రుణ మంజూరు పత్రం అందించడం లేదు.

లెటర్‌ ఇవ్వాలని ఏడీని వేడుకుంటే కార్యాలయం నుంచి సిబ్బందితో బయటకు పంపించారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు గంటసేపు కార్యాలయం ముందు మండుటెండలో నిల్చుని డప్పుకొట్టడంతో సమాచారం అందుకున్న ఎంపీవో సురేందర్‌ వీరయ్యతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంజూరు కోసం ఇచ్చిన పత్రం మండల పరిషత్‌లో ఉండదని, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే రుణ మంజూరు చేసే అధికారం ఉంటుందని సర్దిచెప్పారు.

మరిన్ని వార్తలు