కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్‌ ఖరారు 

24 May, 2023 03:15 IST|Sakshi

జేఎల్‌ పరీక్షలు సెపె్టంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు 

ఆగస్టు 8న ఏఓ, జేఏఓ అర్హత పరీక్ష 

పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు  

టీఎస్‌పీఎస్సీ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పలు ఉద్యోగ నియామకాల అర్హత తేదీలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఖరారుచేసింది. ఇంటర్మీడియ­ట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ అర్హత పరీక్షలను సెప్టెంబర్‌ 12 నుంచి సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు స్పష్టంచేసింది. అన్ని సబ్జెక్టులకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూ­ల్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలన్నీ కంప్యూటర్‌ బేస్డ్‌ రి­క్రూ­ట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 12న ప్రా­రంభం కానున్న పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు దాదాపు 11 రోజులపాటు పరీక్షలు కొనసాగనున్నాయి.   

ఆగస్టు 8న ఏఓ, జేఏఓ పరీక్ష..: పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల్లోని అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏఓ), జూ­ని­యర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ) ఉద్యోగాల భ­ర్తీకి సంబంధించిన పరీక్షను ఆగస్టు 8న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

నిర్దేశించిన రోజున ఉదయం, మధ్నాహ్నం రెండు సెషన్లలో ప­రీక్షలను సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వె­ల్లడించింది. పై అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది.   

మరిన్ని వార్తలు