వర్షాల ఎఫెక్ట్‌: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

13 Jul, 2022 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, విద్యా సంస్థలు తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ, బుధవారం నుంచి కూడా మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, సెలవులను మరోసారి మూడు రోజుల వరకు పొడిగించారు. 


మరిన్ని వార్తలు