నిట్‌లో సైన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

23 Feb, 2022 04:29 IST|Sakshi

కాజీపేట అర్బన్‌: హనుమకొండ కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా సైన్స్‌ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్‌ ప్రసార్‌ సౌజ న్యంతో స్కోప్‌ ప్రాజెక్ట్‌ ద్వారా మంగళవారం నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ స్థాయి సైన్స్‌ వారోత్సవాలను న్యూఢిల్లీ కేం ద్రంగా ఆన్‌లైన్‌లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, జితేందర్‌సింగ్‌ ప్రారంభించారు.

అదే సమ యంలో నిట్‌ క్యాంపస్‌లో సెంట్రల్‌ యూని వర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వీసీ జేజే రావు ప్రారంభించారు. అటవీశాఖ ప్రదర్శన, శాస్త్ర వేత్తల ఛాయాచిత్రాల ప్రదర్శన, సైన్స్‌ ఎగ్జి బిట్స్, పుస్తకప్రదర్శనతో కూడిన సైన్స్‌ ఎక్స్‌పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యా ప్తంగా 75 కేంద్రాల్లో సైన్స్‌ వారోత్సవాలను ఆయా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండగా, ఏపీ, తెలంగాణల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాల జీని తెలుగులో అందజేసేందుకు వేదికగా నిట్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు