ప్రయాణికులకు తీపికబురు.. ఉందానగర్‌– షాద్‌నగర్‌ రైల్వేలైన్‌ రెడీ 

3 Aug, 2021 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌  మార్గంలో చేపట్టిన రైల్వేలైన్‌ల  డబ్లింగ్, విద్యుదీకరణ  ప్రాజెక్టులో భాగంగా ఉందానగర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు  కీలకమైన 29.7 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి  మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, తిరుపతి తదితర నగరాలకు రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉందానగర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పనులు పూర్తయ్యాయి.

మిగిలిన సెక్షన్‌లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేష్‌  తెలిపారు.  సికింద్రాబాద్‌–డోన్‌ సెక్షన్‌లో ప్రస్తుత సింగిల్‌ లైన్‌లో రద్దీ నివారణకు, సికింద్రాబాద్‌ నుంచి గొల్లపల్లి  వరకు సరుకు రవాణా,  ప్రయాణికుల రైళ్ల రవాణాకు ఈ లైన్‌ ఎంతో దోహదంచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గొల్లపల్లి–మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులో  మిగిలిన  పనులు వేగవంతంగా పూర్తి చేయాలని  అధికారులను  ఆదేశించారు.  

మరిన్ని వార్తలు