పలు మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

20 Aug, 2022 08:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్‌లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ–సికింద్రాబాద్‌ (08579/08580) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 24 నుంచి సెప్టెబర్‌ 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ప్రతి గురువారం  సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకి విశాఖ చేరుకోనుంది.

విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ (08585/08586) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 23 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకి మహబూబ్‌నగర్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకి విశాఖ చేరుకుంటుంది.

విశాఖపట్నం–తిరుపతి (08583/08584) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. (క్లిక్: మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ విడుదల)

మరిన్ని వార్తలు