సెకండ్‌ శాటర్‌ డే, సండే కూడా..

5 Mar, 2021 02:03 IST|Sakshi

ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు..

రెండో శనివారం కూడా కార్యకలాపాలు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మార్చి నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌. సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి, హోలీ సెలవులు మినహాయించి మిగతా రోజులు రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉద్యోగ సంఘ ఆఫీస్‌ బేరర్లు బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సీఎస్‌ను గురువారం కలిశారు. శాఖ పరిధిలో ఇటీవల పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది పనితీరు పట్ల సీఎస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ నేతలు పరిష్కరించాలని కోరిన సమస్యలపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కన్వీనర్‌ ముజీబ్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సహదేవ్, సభ్యులు ప్రణయ్‌కుమార్, సిరాజ్‌ అన్వర్, నరేశ్‌గౌడ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు