దయచేసి నాగార్జున సాగర్‌ రావొద్దు..

23 Aug, 2020 11:13 IST|Sakshi

పర్యాటకులకు అనుమతి లేదు..

సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి కొనసాగడంతో డ్యామ్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తివేశారు. కరోనా నేపథ్యంలో ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఎవరూ నాగార్జున సాగర్‌కు రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  నాగార్జున సాగర్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు నాగార్జున సాగర్‌కు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. (పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద)

ప్రస్తుతం సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణా నదిపై నర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ వరద జలాలన్నీ నాగార్జున సాగర్‌కు చేరుకుంటున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు