డెక్కన్‌ మాల్‌ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌

24 Jan, 2023 19:02 IST|Sakshi

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌ పేట డెక్కన్‌ మాల్‌ అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. ఈ ప్రమాదంలో బిల్డింగ్‌ పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పివేసినప్పటికీ బిల్డింగ్‌ లోపలకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ బిల్డింగ్‌ కూల్చివేయాలా? వద్దా అన్న అంశంపై డైలామాలో ఉన్న జీహెచ్‌ఎంసీ అధికారులు చివరికీ కూల్చవేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

ఈ కూల్చివేతకు ముందస్తుగా జీహెచ్‌ఎంసీ ప్రముఖ నిట్‌ నిపుణులతో చర్చలు జరిపి ప్రమాదం ఉండదని తేలిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఈ భవనం కూల్చివేతకు టెండర్లను కూడా ఆహ్వానించింది జీహెచ్‌ఎంసీ. అలాగే స్థానిక నివాసాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూల్చివేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, భవనం కూలి ఇన్ని రోజులైన ఇంకా ఇద్దరి మృతదేహాల ఆచూకి మాత్రం లభ్యం ​కాలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆ రెండు మృతదేహాలు లభించిన తర్వాత కూల్చివేయాలని అధికారులను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది.  

(చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం)

మరిన్ని వార్తలు