డెక్కన్ మాల్‌ అగ్నిప్రమాదంపై కేసు నమోదు.. ఓనర్‌పై కఠిన చర్యలకు పోలీసులు రెడీ

20 Jan, 2023 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డెక్కన్ మాల్‌ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు.

మొదటగా సెల్లార్‌లో ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్న సమయంలో ఏడుగురు సెల్లార్‌లోనే ఉన్నారు. ఆ పొగను చూసి కార్మికులంతా బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్పోర్ట్స్‌ మెటీరియల్‌ గోదాం ఉంది. ఆ మెటీరియల్‌ దించేందుకు ముగ్గురు కార్మికుల్ని యజమాని పైకి పంపించారు. ఆ ప్రయత్నంలో వాళ్లు ఉండగానే.. పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అలా ఆ ముగ్గురు ఫస్ట్‌ ఫ్లోర్‌లోనే చిక్కుకున్నారు. 

ఆ ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయి ఉన్నాయి. భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది. క్రేన్‌ల సాయంతో భవనం పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని డీసీపీ రాజేష్‌ మీడియాకు తెలిపారు. ఇక.. 

డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్ కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమన్న ఆయన.. లోపల డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. బిల్డింగ్ లోపలకి వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమాలిషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమాని పై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు