విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

14 Sep, 2022 03:37 IST|Sakshi
లిఫ్టులను ప్రారంభిస్తున్న కిషన్‌రెడ్డి 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

సికింద్రాబాద్‌: విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దనుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించిందని తెలిపారు. సీతా­ఫల్‌ మండి రైల్వేస్టేషన్‌లో మంగళవారం మూడు లిఫ్టులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్‌ వంటి ప్రయాణికుల సందడి ఎక్కువ కలిగిన రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల మాదిరిగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఆధునీకరణ పనులు సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యాయని వెల్లడించారు.  నగరంలో మొదటి విడత ఎంఎంటీఎస్‌ అధికంగా ప్రజాదరణ పొందిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శరత్‌ చంద్రయాన్, నగర మాజీ మేయర్‌ బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు