సీనియర్‌ జర్నలిస్ట్‌ అమర్‌నాథ్‌ కన్నుమూత: సీఎంల దిగ్భ్రాంతి

21 Apr, 2021 03:24 IST|Sakshi

కరోనాతో నిమ్స్‌లో తుదిశ్వాస

ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్ సంతాపం

సాక్షి, హైదరాబాద్‌ /లక్డీకాపూల్‌: ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు, సీనియర్‌ పాత్రికేయులు కోసూరి అమర్‌నాథ్‌ కన్నుమూశారు. కరోనా వైరస్‌తో బాధపడు తున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవా రం తుదిశ్వాస విడిచారు. పదిరోజుల క్రితం కరోనాతో నిమ్స్‌లో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆయన మృతితో ఏపీ, తెలంగాణ పాత్రికేయ వర్గాల్లో విషాదం నెలకొంది. జర్నలిస్టుల సమస్యలపై గళం విప్పి, పరిష్కారానికి కృషి చేశారంటూ ఆయనను జర్న లిస్టు సంఘాల నేతలు శ్లాఘించారు. అమర్‌నాథ్‌ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌నాథ్‌ అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. 

ప్రముఖుల సంతాపం: మూడు దశాబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి అమర్‌ కృషి చేశారని, ఆయన మరణం జర్నలిస్టులకు తీరని లోటని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజంలో వివిధ స్థాయి ల్లో సేవలందించిన అమర్‌నాథ్‌ మృతి పట్ల టీయూడబ్ల్యూజే సంతాపం తెలిపింది. అమర్‌ మృతి పట్ల శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌ సంతాపం తెలిపారు.

చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ

చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం

మరిన్ని వార్తలు