సీనియర్‌ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుకు డాక్టరేట్‌ 

30 Aug, 2022 00:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్‌ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్‌రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్‌రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్‌రావుకు ఓయూ డాక్టర్‌ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు