Casino Case: ‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు

28 Jul, 2022 20:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చీకోటి ప్రవీణ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సినీ తారల పారితోషికాల లిస్ట్‌ బట్టబయలైంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలకు ఇచ్చిన భారీ పారితోషికాలపై ఈడీ నోటీసులు సిద్ధం చేస్తోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు. మల్లికా షెరావత్‌కు రూ.కోటి, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్‌ హయతీకి రూ.40 లక్షలు, గణేష్‌ ఆచార్యకు రూ.20 లక్షలు ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషికాలను చీకోటి ఇచ్చినట్లు  ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..

చీకోటికి మంత్రులు, ఎమ్మెల్యేలు డీసీసీబి ఛైర్మన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. చికోటితో విఐపీల లింకులు బయటపడుతున్నాయి. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ కీలక ఆధారాలు సేకరిస్తోంది. ప్రవీణ్‌ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల వివరాలు, చెల్లింపులు ఉన్నట్లు సమాచారం. చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చీకోటి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్న చీకోటి.. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌ దేశాలను క్యాసినో అడ్డాలుగా మార్చుకున్నాడు. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్ల తరలిస్తూ.. ఒక్కో విమానానికి లక్షల రూపాయలు చెల్లింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో హోటల్‌కు లక్షలు చెల్లించి ఈవెంట్స్ నిర్వహణకు కస్టమర్ల నుంచి 5లక్షలు ఎంట్రీ ఫీజు ప్రవీణ్‌ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్‌ రెగ్యులర్‌ కస్టమర్లు 200 మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు