వికారం పుట్టిస్తున్న షాడో టీం పోలీసుల వ్యవహారం!

14 Jun, 2021 12:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శాడిస్ట్‌ ‘షాడో’!

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ముఖం వద్ద ఫోన్‌ పెట్టి మరీ వీడియో రికార్డింగ్స్‌ 

గుట్టుచప్పుడు కాకుండా తీయాల్సిన వీడియాలు అందరికీ తెలిసేలా..

హిమాయత్‌నగర్‌: పోలీసు శాఖలోని లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ విభాగాలు ఏ వి ధంగా పనిచేస్తున్నాయో.. ఉన్నతాధికారులు ఆధారాలతో చూసేందుకు వినేందుకు గాను ‘షాడో’ పోలీసులను నియమించారు. వీరు ఆయా పోలీస్‌ స్టేషన్ల లోని పోలీసులు విధులు చేస్తున్నారా.. లేదా అనే విషయాలను కాస్తంత దూరం నుంచి తీసి వాటిని ఉన్నతాధికారులకు పంపించే పని. కానీ కొందరు షాడో పోలీసులు లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులను నీడలా వెంటాడుతున్నారు. 

ఇబ్బందికరంగా దగ్గరకు వచ్చి మరీ.. 
లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద లా అండ్‌ ఆర్డర్‌ ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు విధులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? సరిగ్గా చేస్తున్నారా? లేదా? అనే అంశాలపై షాడో పోలీసులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వీడియోలు, ఫొటోలు తీసుకుని ఉన్నతాధికారులకు అప్‌డేట్‌ చేస్తున్నారు. కాస్తంత దూరం నుంచి తీయాల్సిన వీడియోలు, ఫొటోలను కూడా సిబ్బంది ముఖం వద్ద ఫోన్‌ కెమెరాను పెట్టి మరీ తీస్తున్నారు. దీంతో సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కాస్త ఇబ్బందికి గురవుతున్నారు.  

అత్యుత్సాహం కూడా... 

  • పెట్రోకార్, పెట్రోలింగ్‌ చేసే సిబ్బంది ఎక్కడైనా వాహనాలను ఆపి రెండు నిమిషాల పాటు ఉంటే చాలు.. షాడో సిబ్బందికి సంబంధం లేకపోయినా వారి వద్దకు వెళ్లి మరీ మీరు ఇక్కడెందుకు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలల క్రితం నారాయణగూడ ఠాణా పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో షాడో టీం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌కు కారకులైయ్యారు. 
  • ఈ నెల 8వ తేదీ మంగళవారం రాత్రి లిబర్టీ చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వద్దకు వచ్చి ముఖానికి కెమెరా అనించి మరీ వీడియోస్‌ తీసి వారి విధులకు సైతం ఆటంకం కలిగించారు. దూరం నుంచి వీడియో తీయకుండా దగ్గరకు వచ్చి మరీ సిబ్బందిని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. 
  • దీనిపై ఉన్నతాధికారులు సైతం మౌనంగా ఉంటూ.. షాడో ఇచ్చిన వీడియోల ఆధారంగా లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులపై ఆగ్రహావేశాలను చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

చదవండి: దారి తప్పిన పోలీసు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు